1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Prabhas

Darling Movie | Prabhas | Kajal Agarwal | Karunakaran | 23న వస్తోన్న ప్రభాస్, కాజల్‌ అగర్వాల్‌ల "డార్లింగ్"

డార్లింగ్
WD
యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" షూటింగ్ పూర్తయ్యింది.

ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. "కరుణాకరన్ నాకు ఇష్టమైన డైరక్టర్. "తొలిప్రేమ", "ఉల్లాసంగా.. ఉత్సాహంగా" చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. డార్లింగ్ స్టోరీ నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. లవ్ అండ్ యాక్షన్, మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఫీల్ అన్నీ వుండే మంచి డార్లింగ్" అని అన్నారు.

నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. "డార్లింగ్" కరుణాకరన్ స్టైల్‌లో మంచి ఫీల్ వున్న సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. లవ్‌స్టోరీ అయినా కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ అద్భుతంగా చేశాడు.

కరుణాకరన్ ఎక్స్‌ట్రార్డనరీగా తీశాడు. టేకింగ్ సైడ్‌గానీ, మేకింగ్ సైడ్‌గానీ రిచ్‌గా ఉంటుంది. లవ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఉండడం వలన యూనివర్శల్ అప్రోచ్ వస్తుంది. ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఏప్రిల్ తొలివారంలోనే ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 23న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. "డార్లింగ్" క్లాస్‌గా కనిపించే మాస్ లవ్‌స్టోరీ. మాస్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇందులో ప్రభాస్ నటన సూపర్. మేకింగ్ పరంగా ప్రొడ్యూసర్ ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. జి.వి. ప్రకాష్ అద్భుతమైన పాటలు అందించారు. సినిమా అద్భుతంగా రావడానికి యూనిట్ అంతా తీవ్రంగా శ్రమించాం.

ఇంకా చాలా హోం వర్క్ చేసి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన ప్రకాష్, రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కెమెరామెన్ ఆండ్రూని పరిచయం చేశాను. తప్పకుండా అతనికి చాలా మంచిపేరు తెస్తుంది" అని వెల్లడించారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‍గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, ఆహుతిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజా శ్రీధర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు : స్వామి, సంగీతం : జి.వి. ప్రకాష్, ఫోటోగ్రఫీ: ఆండ్రూ, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: అశోక్, డాన్స్: కళ్యాణ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: అనంత శ్రీరామ్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కరుణాకరన్.
About Writer
SELVI.M