1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Sarvanand

16న ప్రేక్షకుల ముందుకు శర్వానంద్ "ప్రస్థానం"!

ప్రస్థానం
WD
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ప్రస్థానం". దేవకట్టా దర్శకత్వంలో, రవి వల్లభనేని నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు శర్వానంద్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా ఈ కథను చాలా శ్రద్ధతో తయారు చేసుకున్నామని, సాంకేతికంగా మరింత బాగా చేయాలనే క్రమంలో ఈ సినిమా విడుదల జాప్యం జరిగిందని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ.. "వెన్నెల" చిత్రం తర్వాత తాను చేస్తున్న చిత్రమిదన్నారు. ఈ చిత్రం రాజకీయ చిత్రం కాదని, అలా అని రాజకీయం లేకపోలేదని చెప్పుకొచ్చారు. ఇంకా అన్ని అంశాలు సంపూర్ణంగా ఉన్న చిత్రమిదని, ప్రధానంగా మూడు పాత్ర మధ్య కథ నడుస్తుందని అన్నారు. శర్వానంద్, సాయికుమార్, సందీప్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో చక్కటి సందేశం కూడా ఇమిడి ఉందని తెలిపారు.