1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Trisha

Sarvam | Trisha | Arya | ఏప్రిల్ 23న ఆర్య- త్రిషల "సర్వం"

సర్వం
తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శుకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు. 

నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఆయనతో స్ట్రెయిట్ తెలుగు సినిమా తీయాలనే ఆలోచన ఉంది. సర్వం చిత్రం బాగా వచ్చింది. దేవుడు సర్వాంతర్యామి. అన్నీ తెలిసిన వాడిని సర్వాంతర్యామి అని అంటారు. మా చిత్రంలో కథ ఆ నేపధ్యంలో ఉంటుంది. జేడీ చక్రవర్తి బాగా చేశాడు. అన్ని విధాలుగా ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ... హీరో క్యారెక్టరైజేషన్ అద్భుతంగా వచ్చింది. తమిళ భిల్లా తర్వాత ఈ సినిమా బిజీలో ఉన్నాను. పాటలన్నీ ఇండియాలో తీశాము. ఒక మంచి కథాంశంతో మీ ముందుకు వస్తున్నాం. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలోనే తీసే చిత్రానికి దర్శకత్వం వహించనున్నాను. వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT