1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Altaf

Cheta Vennamudda | Altaf | Kritika Krishnan | Krishnudu | Anna Jen | Mercy Killing | మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "చేత వెన్నముద్ద"

చేత వెన్నముద్ద
WD
ఆల్తాఫ్, క్రితిక కృష్ణన్ జంటగా రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న చిత్రం "చేత వెన్నముద్ద". ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు రోహిత్ అభ్యుదయ్ మాట్లాడుతూ.. పాటలన్నీ చక్కటి సాహిత్యంతో అందరినీ ఆకట్టుకుంటాయి. సున్నితమైన కథాంశంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఇందులో వుంటాయి. ఇమంది రామారావు రాసిన పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలను త్వరలో విడుదల చేసి సినిమాను మే నెలలో సినిమాను విడుదల చేస్తాం" అని అన్నారు.

సహ నిర్మాత జానకిరామ్ పామరాజు మాట్లాడుతూ.. తెలుగు తెరపై తొలిసారి మెర్సీ కిల్లింగ్ (కారుణ హత్య)పై వస్తున్న చిత్రం ఇది. సంగీతభరిత చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కృష్ణుడు, అన్నా జెన్, మెటిల్డా, మైక్ తదితరులు నటించారని వెల్లడించారు.

ఈ చిత్రానికి పాటలు: రవి స్వరూపన్, ఇమంది రామారావు, ఎడిటింగ్: వి.ఎన్.రెడ్డి, సంగీతం: రవి స్వరూపన్-లావణ్య, కథ: వి.ఎన్. సతీష్, సహ నిర్మాత: జానకిరామ్ పామరాజు.