Prabhas | Kajal Agarwal | Darling | Magadheera | Shooting | Toliprema | 23న వస్తోన్న ప్రభాస్, కాజల్ అగర్వాల్‌ల "డార్లింగ్"
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా మగధీర హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. "డార్లింగ్" కరుణాకరన్ స్టైల్‌లో మంచి ఫీల్ వున్న సినిమా ఇది. ఇందులో లవ్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ అన్ని అంశాలున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. లవ్‌స్టోరీ అయినా ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.
ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. కరుణాకరన్ ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. టేకింగ్, మేకింగ్‌లలో డార్లింగ్ రిచ్‌గా ఉంటుంది. లవ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ వుండడం వలన యూనివర్సల్ అప్లాజ్ వస్తుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా "డార్లింగ్" చిత్రాన్ని ఏప్రిల్ 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం" అని అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: స్వామి, సంగీతం: జి.వి. ప్రకాష్, ఫోటోగ్రఫీ: ఆండ్రూ, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: అశోక్, డాన్స్: కళ్యాణ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: అనంత శ్రీరామ్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కరుణాకరన్.
