1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Sudan Raj

Dhool | Sudan Raj | Payal Shetty | Manu | Srilekha | మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "ధూల్"

ధూల్
జై మారుతి ఫిలింస్ పతాకంపై ప్రముఖ వ్యాపారావేత్త కె.ఆర్.ఎస్. అయ్యంగార్ ఫైట్ మాస్టర్ బి.విక్కీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ధూల్". బి. విక్కీ కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో కొత్త కథానాయకుల్ని పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలైంది. 

ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో రీ-రికార్డింగ్‌ను పూర్తిచేసుకుని డీటీఎస్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శక నిర్మాత అయ్యంగార్ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. సంగీత దర్శకుడు ఖుద్దూస్‌కి ఈ పాటల ద్వారా మంచి పేరు వచ్చింది.

మే మొదటివారంలో రెండో విడతగా ఆడియో సీడీలను విడుదల చేయనున్నాం. ఇక సినిమాపరంగా దర్శకుడు విక్కీ ఎంతో శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు. తప్పకుండా "ధూల్" అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 25 కల్లా "ధూల్" తొలి కాపీని సిద్ధం చేస్తాం. దీనికి ముందుగా "ధూల్" సినిమా ట్రైలర్స్‌ని మే తొలివారంలోని రాష్ట్రంలోని అన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తాం" అని అన్నారు.

సుదన్‌రాజ్, పాయల్ శెట్టి, మను, శ్రీలేఖ జంటలుగా నటించిన ఈ చిత్రంలో ప్రసాద్‌బాబు, ఎం.ఎస్. నారాయణ, కొండవలస, గుండు హనుమంతరావు, కవిత, గీతాసింగ్, అభినయశ్రీ, జ్యోతిరాణా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఖద్దూస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జగదీష్, ఎడిటింగ్ : నందమూరి హరి, మాటలు : వి.వి. రమణ, ఫైట్స్ : ప్రకాష్, సతీష్, కళ : నారాయణ వద్ద పనిచేతసిన సాంకేతికవర్గం. నిర్మాత : కె.ఆర్.ఎస్. అయ్యంగార్, సహ నిర్మాతలు : టి.వి.రావు, హెచ్.డి. వెంకటేష్, వై.వి.రావు, జి.ఎస్.రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : బి. విక్కీ.