1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Telangana

Dhoom Dham | Telangana | Daily Four Shows | April 30 | 30న వస్తోన్న తెలంగాణ బతుకు చిత్రం "ధూం ధాం"

ధూం ధాం
WD
డైలీ ఫోర్ షోస్ పతాకంపై శివానంద్ యాలాల దర్శకత్వంలో జోగన్నగారి అరుణారెడ్డి సమర్పణలో వై.వి.వి.మను నిర్మించిన తెలంగాణ బతుకు చిత్రం "ధూం ధాం" ఆడియో సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. వర్తమాన తెలంగాణ పోరాటం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు, సినిమా పరిశ్రమ ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ పోరాట కథాంశంతో చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలను కోదండరామ్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ నెల 30 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మధుప్రియ, అరుణారెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.