1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Glamour Movie

Karishma Kotak | Glamour Movie | Shankar dada Zindabad | Farah Khan | Bhuvaneswari | 30న ప్రేక్షకుల ముందుకు కరిష్మా కొటాక్ "గ్లామర్"

కరిష్మా కొటాక్
'సర్దార్ చిన్నపరెడ్డి', 'రంగుల కల' వంటి చిత్రాలను నిర్మించి పి. సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "గ్లామర్". 'శంకర్‌దాదా జిందాబాద్' ఫేమ్ కరిష్మా కొటాక్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి చెప్పారు. 

సరైన అవగాహనలేకుండా సినీరంగంలోకి వచ్చే నూతన నటీనటులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతున్నారనే అంశంతో పాటు గ్లామర్, వినోదం సమపాళ్ళలో రంగరించి ఈ చిత్రాన్ని మలిచామని సత్యారెడ్డి తెలిపారు. చిత్రరంగంలోకి అడుగుపెట్టేవారికి ఈ చిత్రం డిక్షనరీలా ఉంటుందన్నారు.

గతంలో బప్పీలహరి వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన బొంబే రవికుమార్ ఈ చిత్రానికి మంచిసంగీతం అందించానని, లహరి ఆడియో ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ దర్శక నిర్మాతలకు సందేశాన్నిచ్చే పాత్రలో నటించారని పేర్కొన్నారు.

ఇంకా ఈ చిత్రంలో ఫరాఖాన్, ధర్మవరపు, జీవా, భువనేశ్వరి, శకుంతల, గుండు హనుమంతరావు, జెన్నీ తదితరులు నటించారు. కెమెరా : శ్రీనివాసరావు, ఎడిటింగ్ : శ్రీనివాస్, కళ : రామకృష్ణ, సమర్పణ : ఎస్.ఎన్.రెడ్డి, నిర్మాత : పి. సతీష్ రెడ్డి, ఆర్. సూర్యప్రకాష్, సహనిర్మాతలు : డి. కిషోర్ కుమార్, తలశిల శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : పి. సత్యారెడ్డి.