Love Cheste | Movie | Hippi | Abhi | Vishnu | వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు "లవ్చేస్తే"
WD
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "ఇదొక ఫీల్‌గుడ్ సినిమా. యువత ప్రతినిధులుగా హీరోహీరోయిన్లుంటారు. తల్లిదండ్రుల్ని కాదని తమ ప్రేమకే ప్రాముఖ్యత ఇచ్చేవారికి ఈ సినిమాలో చక్కటి సందేశముంది. ఈ చిత్రంలో కొత్తవారికి అవకాశం కల్పించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి" అని చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన అప్పారావు మాట్లాడుతూ.. "చక్కటి ప్రేమకథా చిత్రమిది. హైదరాబాద్, అరకు, వైజాగ్, కేరళ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో ఐదుపాటలు లిండ్సే సంగీతం సమకూర్చారు. మే 2న ఆడియోను ఆదిత్య ద్వారా విడుదల చేస్తున్నాం. నెలాఖరున సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం" అని అన్నారు.
విష్ణు, అభి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎన్. కోటేశ్వరరావు, మాటలు : ధ్రువనాగ్, కోనవెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ధ్రువనాగ్.
