Lawrence | Vedi Style veru | Movie | Snehita | May Release | Piramid Natarajan | వేసవి కానుకగా వస్తోన్న "లారెన్స్" (వీడి స్టైలే వేరు)
WD
ఈ సందర్భంగా నిర్మాత కోరుకొంవరహల రావు "లారెన్స్" సినిమా గురించి చెబుతూ.. తమిళంలో సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ అందించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు "లారెన్స్" అనే పేరుతో అనువదిస్తున్నాం. ఇందులో కథానాయకుడు ఇంటికి పెద్ద కొడుకు అయితే.. ఎలాంటి బాధ్యతల్ని చేపట్టకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతో ఓ సందర్భంలో హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడ్తాడు.
అయితే అణాపైసాకి పనికిరాని నువ్వు నన్ను ప్రేమించడం.. రేపు పెళ్ళి అయ్యాక ఏం పెట్టి పోషిస్తావ్? అంటూ లారెన్స్ ప్రేమని తిరస్కరించడంతో.. నిజమేనంటూ.. అక్కడ్నించి హీరో లారెన్స్ "మొబైల్ రెస్టారెంట్"ని పెట్టి నలుగురిలో పేరును సంపాదిస్తాడు. అలా తీవ్రంగా శ్రమింటి వెల్‌కమ్ గ్రూప్ హోటల్స్‌కి అధినేత అవుతాడు.
ఒక లక్ష్యంతో ఎదిగిన తర్వాత అతను ఆమె ప్రేమను పొందుతాడా? సంఘంలో అటు పరపతి ఇటు డబ్బు అన్ని సంపాదించుకున్న లారెన్స్‌ని ఆమె భర్తగా అంగీకరిస్తుందా? లేదా? అనేదే "లారెన్స్" చిత్రం కథాంశం. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి. తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. సెన్సార్ పూర్తి గావించి మే నెవలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
లారెన్స్-స్నేహిత, పిరమిడ్ నటరాజన్ ప్రధాన పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి సంభాషణలు: ఘంటశాల రత్నకుమార్ రాశారు. గీత రచయితలు : సాహితి, భారతీబాబు, సంగీతం : శివకుమార్, ఎడిటింగ్ : మధు పనిచేసిన సాంకేతిక వర్గం, నిర్మాత : కోరుకొండ వరహల రావు, సమర్పణ : శ్రీదేవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అర్పుతం.
