1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Rajasekhar

Maa Annayya Bangaram | Rajasekhar | Kamalini Mukherjee | Shooting | జూన్‌లో "మా అన్నయ్య బంగారం" విడుదల

మా అన్నయ్య బంగారం
WD
డాక్టర్. రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా నటిస్తోన్న "మా అన్నయ్య బంగారం" చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బంజారాహిల్స్ రాక్‌కాజిల్ సమీపంలోని ఓ హోటల్‌లో హీరోహీరోయిన్లపై సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర నిర్మాత నట్టికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. "ఏడుగురు అన్నదమ్ముల కథతో ఈ చిత్రం రూపొందుతోంది. చంద్రబోస్ ఐదు చక్కటి పాటలు రాశారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. "తొలుత స్విట్జర్లాండ్‌లో పాటలతో షూటింగ్ ప్రారంభించాలనుకున్నాం. కానీ ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం పేలడం, అక్కడి విమానాలు రద్దుకావడంతో షూటింగ్ వాయిదా వేసుకున్నాం. ఈ కథకు కథే హీరో. భూపతిరాజా సూపర్ కథను అందించారు. కథ ప్రకారం అందరం పోటీపడి నటిస్తున్నాం. హ్యూమన్ వాల్యూస్‌తో కూడిన కథ ఇది. పిల్లల్ని ఎలా పెంచాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి?. ఈ మధ్య బాంధవ్యాలు, బంధాలు తగ్గిపోతున్నాయి. ఒకరికొకరు వేరువేరుగా జీవించే స్థాయికి చేరుకున్నాం. ఈ సినిమా చూశాక భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది" అన్నారు.

దర్శకుడు జొన్నలగడ్డ శ్రీను మాట్లాడుతూ.. "ఈ నెల పదోతేదీ రాత్రి స్విట్జర్లాండ్ వెళుతున్నాం. 18న తిరిగి వస్తున్నాం. అప్పటినుంచి మిగిలిన టాకీతో పాటు పాటలు కంటెన్యూగా సాగుతాయి. జూన్‌నెలాఖరికి సినిమా పూర్తవుతుంది" అన్నారు. ఇకపోతే.. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్, నిర్మాణ సారథ్యం: నట్టి లక్ష్మీ కరుణ.