1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Supercow Boy

Lawrence | Supercow Boy | Padma Priya | Lakshmi Roy | Sandhya | మే 7న "సూపర్ కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!

లారెన్స్
WD
నృత్యదర్శకుడు లారెన్స్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన "సూపర్ కౌబాయ్" చిత్రాన్ని ఈ నెల ఏడోతేదీన విడుదల చేస్తున్నట్లు నైజాం, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ డి.ఎస్. రావ్ తెలియజేశారు. తెలుగు ఈ రెండు ప్రాంతాల్లో తామే విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ చిత్రాన్ని ఎస్‌జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాత్తి ఎస్. అగోరమ్ నిర్మించారు. 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ కౌబాయ్ చిత్రాన్ని నిర్మించారు. 18వ శతాబ్దానికి చెందిన కథతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు.

ఇంకా ఈ చిత్రంలో పద్మప్రియ, లక్ష్మీరాయ్ నాయికలుగా నటించారు. ఇంకా సాయికుమార్, సంధ్య, నాజర్, మనోరమ, సెంథిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి. ప్రకాష్‌కుమార్.