1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Ram

Rama rama krishna krishna | Ram | Bindu Madhavi | Chalaki | Aditya | 12న రామరామ కృష్ణకృష్ణ... 20న చలాకీ

రామరామ కృష్ణకృష్ణ
రామ్, ప్రియానంద్, బిందుమాధవి హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన చిత్రం రామరామ కృష్ణకృష్ణ. ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఈ చిత్ర వైబ్‌సైట్‌ను శుక్రవారం హీరో రామ్ ఆవిష్కరించారు. ఇందులో సినిమాకు సంబంధించిన వివరాలుంటాయని చెప్పారు.

మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందిందనీ, అందరూ ఆదరించేటట్లుగా ఉంటుందన్నారు. కొందరు రాముడిగా, కొందరికి కృష్ణుడిగా కన్పించే పాత్ర తనదనీ, శ్రీవాసు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుందన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం

20న చలాకీ
ఆదిత్యబాబు హీరోగా పరిచయం అవుతున్న చలాకీ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. ఇటీవలే ఆడియో విడుదలైంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందనీ, రాజమౌళి కూడా మెచ్చుకున్నారనీ దర్శకుడు మాదేష్ తెలియజేశారు.

శుక్రవారం ఆయన తన చిత్రం గురించి చెపుతూ... కన్నడలో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం. మహిళలు చదివే కాలేజీలో యువకుడు చేరుతాడు... దానికి కారణమేమిటి అనేది ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందన్నారు. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని చెప్పారు. రోమా, బియాంక దేశాయ్ హీరోయిన్లుగా నటించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT