Pavan Kalyan | Komaram Puli | S.J Surya | జూన్ ద్వితీయార్థంలో పవన్ కల్యాణ్ "కొమరం పులి"
WD
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... పవర్‌ఫుల్ స్టోరీతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో రూపొందుతోన్న కొమరం పులి తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచేలా ఉంటుంది. అతి త్వరలోనే ఈ ఆడియోను సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేసి జూన్ ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నికిషాపటేల్ నటిస్తోంది. ఇంకా మనోజ్ బాజ్‌పాయ్, నాజర్, చరణ్ రాజ్, అలీ, బ్రహ్మాజీ తదితరులు నటించారు. నిర్మాత శింగనమల రమేష్ బాబు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎస్.జె.సూర్య
