1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Naani

Bhimili Kabaddi Jattu | Naani | Saranya Mohan | Village Lo vinayakudu | Cinema | 24న ప్రేక్షకుల ముందుకు "భీమిలి కబడ్డీ జట్టు"

భీమిలి కబడ్డీ జట్టు
WD
నాని, విలేజ్‌లో వినాయకుడు ఫేమ్ శరణ్యమోహన్ జంటగా నటిస్తున్న "భీమిలి కబడ్డీ జట్టు" ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుప్రసిద్ధ నిర్మాత ఆర్.బి. చౌదరి మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లిమెటెడ్ పతాకంపై నూతన దర్శకుడు తాతినేని సత్యను పరిచయం చేస్తూ నిర్మించిన "భీమిలి కబడ్డీ జట్టు" అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా గురించి చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. "భీమిలి కబడ్డీ జట్టు" ద్వారా తాతినేని ప్రకాశరావుగారి మనుమడు తాతినేని సత్యను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సత్య తండ్రి దర్శకులు తాతినేని కూడా తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించారు. యువదర్శకుడు సత్య "భీమిలి కబడ్డీ జట్టు"ను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించారు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రం ద్వారా కెమెరామెన్‌గా కె. చిట్టిబాబుని, సంగీత దర్శకుడిగా సెల్వగణేష్‌ని పరిచయం చేస్తున్నాం." అని చెప్పారు.

నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. యువతరంకి కావాల్సిన అన్ని అంశాల్ని మేళవించి అద్భుతంగా రూపొందించాం. ఇప్పటికే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది" అని అన్నారు.

నాని, శరణ్యమోహన్, కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, జయంతి, కృష్ణ చైతన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సుశీ, మాటలు : అల్లు దిలీప్‌కుమార్, సంగీతం : సెల్వగణేష్, ఛాయాగ్రహణం: కె. చిట్టిబాబు, కళ : కుమార్, ఎడిటింగ్ : నందమూరి హరి, కో-డైరక్టర్: రమణ మాధవరం, ప్రొడక్షన్ : అశోక్, వేద, ఉమామహేష్, సమర్పణ : ఆర్.బి.చౌదరి, నిర్మాతలు : ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్, దర్శకత్వం: తాతినేని సత్య.