Little Budha, Three languages, | మూడు భాషల్లో "లిటిల్ బుద్ధ" చిత్రం
WD
ఈ సందర్భంగా నిర్మాత బొర్రా రవికుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... గౌతమబుద్ధుని జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని మూడు భాషల్లో నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో మాస్టర్‌మైండ్స్ చిత్రంలో హీరోగా నటించిన బాలనటుడు మాస్టర్ సుప్రీమ్ గౌతమబుద్ధునిగా నటిస్తున్నాడు. ఇందులో 12, 13 సంవత్సరాల వయస్సు గల బాల నటీనటులు నటిస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాణం నాలుగు షెడ్యూళ్లలో ఆరు నెలలపాటు నిర్విరామంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లోను బుద్ధగయలోని కొండలు అడవులు, సెలయేళ్ల మధ్యగల అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. టాకీ పార్ట్‌తోపాటు నాలుగు పాటలు షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభించాం. దర్శకుడు శివనాగు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఇందులో బాల నటీనటులు చక్కటి నటనను ప్రదర్శించారు. ఎక్కడా రాజీపడకుండా మేము అనుకున్న ప్రకారం చిత్ర నిర్మాణం చేశాం. తప్పకుండా మా బ్యానర్‌కు చాలా మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. జులై మొదటివారంలో ఆడియోను, జులై నెలాఖరున సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
