1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Manchu Manoj

జూలై 1న విడుదల కానున్న "ఝుమ్మంది నాదం"

ఝుమ్మంది నాదం
WD
శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న చిత్రం "ఝుమ్మంది నాదం". కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఆడియో హిట్ అయిందని సమర్పకుడు మోహన్ బాబు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

బిడ్డ పుట్టగానే వీడు ప్రయోజకుడవుతాడని తెలిసిపోతోంది. అలాగే బ్యానర్ స్థాపించినప్పుడు అలాగే అనిపించింది. ఈ చిత్ర కథ విన్నప్పుడు అలాగే అనిపించింది. తప్పకుండా ఈ చిత్రం గొప్ప సక్సెస్ అవుతుందని మోహన్ బాబు చెప్పారు. ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ తీశాం.

తొమ్మిది పాటలున్నాయి. వేటికవే గొప్పగా ఉన్నాయి. సహజంగా సినిమాలో రెండు, మూడు పాటలు బాగున్నాయని అంటారు. కానీ ఇందులో అన్ని పాటలు బాగున్నాయని రిపోర్ట్ రావడం చాలా ఆనందాన్ని కల్గించింది. జూలై 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ... అప్పుడే సినిమా అయిపోయిందా అన్నంతగా ఫీలయ్యాం. చాలా సరదాగా షూటింగ్ జరిగింది. రాఘవేంద్రరావు మా బ్యానర్ లో సినిమాకు దర్శకత్వం వహించడం గొప్పగా ఫీలవుతున్నాను అని చెప్పారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి