Em pillo Em pillado | Pranita | SS Ravikumar | జూలై మొదటి వారంలో "ఏం పిల్లో ఏం పిల్లడో"
తెలుగు ప్రేక్షకులు మెచ్చినటువంటి ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించిన ఈతరం అధినేత పోకూరి బాబూరావు తాజాగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తనీష్, ప్రణీత జంటగా నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి కావించుకుని ప్రస్తుతం డీటిఎస్ మిక్సింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది.
జూలై మొదటి వారంలో ఫస్ట్ కాపీ రాబోతున్న ఈ చిత్రాన్ని జులై రెండో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత పోకూరి బాబూరావు సర్వసన్నాహాలు చేస్తున్నారు.
