1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Cinema

Em pillo em pillado | Cinema | Tanish | Pranita | July | Censor | శభాష్ అనిపించుకునే "ఏం పిల్లో ఏం పిల్లడో"..!

ఏం పిల్లో ఏం పిల్లడో
FILE
ఈతరం పిక్చర్స్ అధినేత పోకూరి బాబూరావు తనీష్, ప్రణీత జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వాన నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 16వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, "మా పిల్లా, పిల్లాడులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఆడతారు, నవ్విస్తారు, కాసేపు కంట తడిపెట్టిస్తారు. చివర్లో పెద్దల కళ్ళు తెరిపించి "ఏం పిల్లో ఏం పిల్లడో" శభాష్ అనిపించుకుంటారు. ఇక మా దర్శకుడు రవికుమార్ చౌదరి మేం గతంలో నిర్మించిన యజ్ఞం తర్వాత మళ్లీ బాగా తీశాడు. ఇంకా ఈ సినిమా కాదు. చిన్న హీరో హీరోయిన్లతో చేసిన చాలా పెద్ద సినిమా. నా గత 14 చిత్రాల కంటే ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అని అన్నారు.

తనీష్, ప్రణీత (పరిచయం), చంద్రమోహన్, చరణ్‌రాజ్, ఆహుతి ప్రసాద్, డాక్టర్. శివప్రసాద్, రవిశంకర్ (పరిచయం), ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : ఈతరం యూనిట్, మాటలు : భాషా శ్రీ, పాటలు : భాస్కర పట్ల, రామజోగయ్య శాస్త్రి, భాషాశ్రీ, సంగీతం : మణిశర్మ, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫోటోగ్రఫీ : సి.హెచ్. రమణరాజు, సమర్పణ : పోకూరి రామారావు, నిర్మాత : పోకూరి బాబూరావు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.
About Writer
SELVI.M