Jayammu Nistchayammura | Gopal | Sucharita | Krishna Bhagavan | జూలై నెలాఖరున వస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా
WD
సెన్సార్ వారిచే క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం గురించి దర్శకుడు రవీందర్ మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉన్న చిత్రమిది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో వినోదంపాలు కూడా ఎక్కువే. ఇటీవలే సెన్సార్ వారిచే అభినందనలు అందుకున్న ఈ చిత్రాన్ని జూలై నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రానికి కెమేరా: విజయ్ సి. ఆనంద్, సంగీతం: హేమంత్ కుమార్, సహనిర్మాతలు: బోయిని శ్రీనివాస్, నిర్మాతలు: తమ్మ రవీందర్, మహ్మద్ సలీమ్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రవీందర్
