Brahma lokam to Yama lokam, Rajendra Prasad, | జూలై 29న ''బ్రహ్మలోకం టు యమలోకం''
WD
చిత్రం గురించి రాజేంద్రప్రసాద్ వివరిస్తూ... పాత్రలకు సరిపడా నటీనటులు వుంటేనే ఎటువంటి కథ అయినా సక్సెస్ అవుతుంది. 34 ఏళ్ళ నా కెరీర్‌లో తెలుసుకున్నది ఇది. ఆ కోవలోనిదే ఈ చిత్రం. కొన్ని చిత్రాలు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనేట్లు ఉంటాయి. ఈ చిత్రంకూడా అలాంటిదేనని చెప్పగలను.
సహజంగా బ్రహ్మకు మూడు తలలు కృతకంగా పెడుతుంటారు. మారిన టెక్నాలజీ రీత్యా ఒరిజినల్‌గా వచ్చేట్లు చూపుతామని చెప్పగానే అందుకు ఖర్చయినా నిర్మాత వెనుకాడకుండా ఓకే అన్నారు. యముడి పాత్రలో జయప్రకాష్‌రెడ్డి అద్భుతంగా నటించాడు. సోషియో ఫాంటసీతో రూపొందిన ఈ చిత్రం అందరి మన్ననలను పొందుతుందనే నమ్మకముందని' అన్నారు.
శివాజీ మాట్లాడుతూ, చందమామలాంటి కథ. బ్రహ్మరాసిన రాతతో భూలోకంలో మా బతుకులు ఎలా మారతాయో వినోదాత్మకంగా తీశారు. అద్భుతంగా వచ్చింది. సోనియా మంచి నటి. రాజేంద్రప్రసాద్‌తో మూడు చిత్రాల్లో నటించాను. ఆయనతో నటించడం చాలా సరదాగా ఉంటుంది. త్వరలో ఆయనతో మరో చిత్రంలో నటించనున్నాను. మా కాంబినేషన్ హిట్ కాంబినేషన్. దర్శకుడు అనుకున్నది అనుక్నుట్లు తీశారు' అని చెప్పారు.
'దేవత పాత్రలో నటించాలనే కోరిక ఈ చిత్రంలో సరస్వతి పాత్రద్వారా తీరిందని' కళ్యాణి పేర్కొంది. నిర్మాతల్లో ఒకరైన కొండవీటి రాజా మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదలచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో గీతరచయిత భాస్కరభట్ల, నటి సోనియా, దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, చిత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
