1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Surya Kiran

Chapter -6 | Surya Kiran | Kalyani | సెన్సార్‌ పూర్తయిన సూర్య కిరణ్ ''చాప్టర్‌-6''

ఛాప్టర్ 6
నటి కళ్యాణి నిర్మాతగా సూర్యకిరణ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'చాప్టర్‌-6' చిత్రం సెన్సార్‌ పూర్తయింది. ఈ సందర్భంగా శనివారం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు సూర్యకిరణ్‌ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభంలో నిర్మాతగా భయమేసింది. 

షూటింగ్‌ చేయగా చేయగా స్నేహితులు, శ్రేయోభిలాషులు సపోర్ట్‌తో ధైర్యంగా పూర్తిచేశాను. ఆరు కథలతో రూపొందిన ఈ చాప్టర్‌ రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఆరు పాటలను ఒక్కో సంగీత దర్శకుడు ఆలపించడం ప్రత్యేకత. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

సెన్సార్‌వల్ల విడుదల కాస్త ఆలస్యమైంది. 'సత్యం' చిత్రంతో దర్శకుడిగా నన్ను ఆదరించారు. నిర్మాతగా నా భార్యను ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఆగస్టు మొదటివారంలో విడుదలచేయడానికి సిద్ధంచేస్తున్నామని' తెలిపారు.

నిర్మాత కళ్యాణి మాట్లాడుతూ 'ఎన్నో చిత్రాలద్వారా నన్ను ఆదరించారు. ఇది ఫ్యామిలీతో చూడదగ్గచిత్రం. ఈ చిత్రానికి నిర్మాత సూర్యకిరణ్‌. ఆయన స్నేహితులు చాలా హెల్ప్‌చేశారు.ఈ చిత్రాన్ని చూసి ఆదరించండి' అన్నారు.

బాల, సోనియాసూరి, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు, సత్యంరాజేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివన్‌, బ్యానర్‌: మిడాస్‌టచ్‌, కెమెరా: రాజా, చిత్రైసెల్వన్‌.