Shankar | Rajinikanth | Robot | audio release | అప్పుడు గుండు బాస్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ లుక్ రోబో
WD
ఈ చిత్రంలో అందాల సుందరి ఐశ్వర్యారాయ్ రజనీ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో పోస్టర్లను శంకర్ విడుదల చేశారు.
అదేవిధంగా జూలై 31న రోబో చిత్రం ఆడియా ఆవిష్కరణ కార్యక్రమం జరుగింది. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సభలో రజనీ ఎలక్ట్రిక్ షాక్ లుక్ స్టయిల్‌లో ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు.
ఈ స్టిల్ చూసిన ప్రేక్షకులలో రోబోలో రజనీ రోల్ ఎలా ఉంటుందనే ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇదిలావుండగా చిత్ర దర్శకుడు శంకరై తనదైన శైలిలో చిత్రాన్ని గురించిన హింట్స్ ఏమాత్రం చెప్పలేదు. రోబో ఎలా ఉంటాడనేది వెండితెరపై చూస్తేనే బావుంటుందని చెప్పారు. అలాగే చూద్దాం.. రోబో ఎలా ఉంటాడో...
