గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » సెప్టెంబరు 10న శ్రీహరి "భైరవ" (September 10 | Bhairava | Nattikumar)
రాబోయే చిత్రాలు
Bookmark and Share Feedback Print
 
శ్రీహరి కథానాయకుడిగా నటిస్తోన్న భైరవ చిత్రం ఈనెల 10వ తేదీన విడుదలవుతుందని నిర్మాత నట్టికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రారంభించాం. శ్రీహరి పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. పోలూరి శ్రీనివాసరెడ్డి చక్కటి టేకింగ్‌తో తెరకెక్కింది. ఫైట్ మాస్టర్ విజయన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. ఆయన ఫైట్స్ గురించే శ్రీహరి ప్రత్యేకంగా ఆయనను మద్రాస్ నుంచి తెప్పించారు. కథలో భాగంగా యాక్షన్, హాస్యం కూడా ఉంటాయని అన్నారు.

శ్రీలేఖ రీరికార్డింగ్ చక్కగా చేసింది అని తెలిపారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పోలీసులంటే ప్రజలను ఎయిర్వేస్ తెచ్చేవారే అని పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఆయన కుమారుడు మాస్టర్ మేఘాంశ్ కీలక పాత్ర పోషించారు అని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సెప్టెంబరు 10, భైరవ, నట్టికుమార్