1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. దీక్షాసేథ్ చాలా క్యూట్‌గా ఉంటుంది: విక్రమ్‌

Vikram, Veedinthe by Birth Cinema | దీక్షాసేథ్ చాలా క్యూట్‌గా ఉంటుంది: విక్రమ్‌

విక్రమ్
WD
సియాన్‌ విక్రమ్‌- అపరిచితుడు గుర్తుండే ఉంటుంది. రకరకాల పాత్రల్లో షేడ్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'నాన్న'తో విలక్షణమైన పాత్ర పోషించి మెప్పించాడు. ఇప్పుడు తాజాగా 17 పాత్రల్ని పోషించాడు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డి.సురేష్‌బాబు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా పేరు 'వీడింతే' బై బర్త్‌.... ఈ చిత్రం గురించి విక్రమ్‌ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మాట్లాడారు.

ఏప్రిల్‌ 17 నా పుట్టినరోజు. లక్కీగా ఈ సినిమాలో గెటప్‌లు 17. వీడింతే సినిమా కథేమిటంటే... ఇందులో జిమ్‌బాయ్‌గా నటిస్తాను. అతనికి యాక్టర్‌ అవ్వాలనే కోరిక. అందుకు రకరకాల గెటప్స్‌ వేయాల్సి వస్తుంది. 'నాన్న' చిత్రంలో చేసిన పాత్ర హెవీగా ఉంది. ఆ తర్వాత ఎటువంటి పాత్రలు వేయాలా అని చూస్తున్న టైంలో 'నా పేరు శివ' దర్శకుడు సుశీంద్రన్‌ వచ్చి కథ చెప్పాడు.

నేనేదో... చక్కగా ముగ్గురు హీరోయిన్లు బాగానే ఉన్నారు. వారితో డ్యూయెట్లు పాడుకుందామనుకున్నాను. కానీ దర్శకుడు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. గెటప్స్‌ పెట్టి బ్రేక్‌ చేశాడు. కాకపోతే... 17 గెటప్పులు ఒక్కో సీన్‌లో వచ్చిపోతుంటాయి. అవి ఎందుకు వస్తాయి. అనేది సినిమా చూడండి... ఈ చిత్రంలో దీక్ష అద్భుతంగా చేసింది. మోడ్రన్‌గా బాగా నటించింది. చాలా జోవియల్‌గా, క్యూట్‌గా ఉంది అని కితాబిచ్చారు. ఈ సినిమా ఈనెల 23న విడుదకానుంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT