1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. December 23 Release

డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు షారుక్ ఖాన్ "డాన్ 2"( వీడియో)

డాన్ 2 వీడియో
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బుధవారం డాన్ 2 ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రాన్ని ఈ నెల 23న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా హైదరాబాద్ నగరంతో తనకు పరిచయం ఈనాటిది కాదనీ, తను టోలీచౌక్‌లో సుమారు నాలుగేళ్లపాటు ఉన్నానన్నారు. అప్పుడు హైదరాబాద్ నగరమంతా కలియతిరిగేవాడిననీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ తినేవాడిననీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు తానెవరో ఎవరికీ తెలియదన్నారు.

అలా హైదరాబాదు నగరంలో నాలుగేళ్లు హేపీగా గడిపిన తాను ఆ తర్వాత బెంగళూరుకు, అనంతరం ఢిల్లీకి వెళ్లి... ఆ పిదప బాంబే వెళ్లాననీ, సీరియళ్లు, సినిమాలతో ఇలా మీ ముందు నిలబడ్డానని తన గతం తాలూకు స్మృతులను గుర్తు చేసుకున్నారు షారుక్ ఖాన్.

ఇక డాన్ 2 గురించి చెప్పేకంటే థియేటర్లలో చూస్తేనే మజా ఉంటుందన్నారు. ఆ మజా ఏంటో చూడాలంటే డిసెంబరు 23 వరకూ ఆగాల్సిందే మరి. చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీడియో.

సౌజన్యం: ఎక్సెల్ మూవీస్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి