Poolarangadu | Sunil | January 14 | జనవరి 14న సునీల్ ''పూలరంగడు'' విడుదల
సునీల్, ఇషాచావ్లా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'అహనా పెళ్ళంట' డైరెక్టర్ వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూలరంగడు' ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. జనవరి 5కల్లా ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ చిత్రం ఆడియోను జనవరి 6న రిలీజ్ చేసి, చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ పాట కూడా జనవరి 5కి పూర్తవుతుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా జనవరి 6న ఆడియో రిలీజ్ చేసి, 9కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ జనవరి 14నే వరల్డ్‌వైడ్‌గా 450 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న సునీల్‌ను 'పూలరంగడు'లో కొత్త యాంగిల్‌లో కనిపించబోతున్నారు.
ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఈ ఎంటర్‌టైనర్‌లో క్లైమాక్స్ షాకింగ్‌గా వుంటుంది. కనల్ కణ్ణన్ సారధ్యంలో తీసిన ఈ క్లైమాక్స్ ఫైట్ సినిమాకి హైలైట్ అవుతుంది. అలాగే సునీల్ డాన్సులు ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతాయి. మా మాక్స్ ఇండియా బేనర్‌లో 2011లో వచ్చిన 'ప్రేమకావాలి'ని ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. 2012 సంక్రాంతి కానుకగా వస్తున్న 'పూలరంగడు'ని కూడా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ - ''నటీనటుల సహకారంతో అనుకున్న షెడ్యూల్‌లోనే చిత్రాన్ని పూర్తి చేస్తున్నాం. సునీల్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది. ఈ సంక్రాంతికి అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి జనవరి 14న రిలీజ్ అవుతోంది'' అన్నారు.
సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యంరాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్యూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్.ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్తపల్లి మురళీకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫి: ప్రసాద్‌మురెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్. మూవీ మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం.