రవితేజ - శ్రీనువైట్లల కాంబినేషన్‌లో విడుదలైన తాజా చిత్రం దుబాయ్ శీను. ఇది దేశముదురు రూపొందిన పతాకంపైనే నిర్మితమైంది. భారీ ఓపెనింగ్స్ వచ్చిన దుబాయ్ శీను అభిమానుల అంచనాలకు తగ్గ స్థాయిలో ఉంది.
WD
హీరో రవితేజ విషయానికి వస్తే గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హిట్ సినిమా లక్ష్మీ తరువాత హీరోయిన్ నయనతార నటించిన సినిమా దుబాయ్ శీను. సక్సెస్ ఫుల్ దర్శకుడు, సక్సెస్ ఫుల్ హీరో, సక్సెస్ ఫుల్ హీరోయిన్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా దుబాయ్ శీను తొలిరోజు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది.
డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో బ్రోకర్(వేణుమాధవ్) చేతిలో మొసపోయిన శ్రీనివాస్ అలియాస్ శీను (రవి తేజ) డబ్బుపోయి వెనక్కు తిరిగిరాలేక యాతనపడుతుంటారు. ఇదిలా ఉండగా పట్నాయక్(కృష్ణ భగవాన్)అనే మరో మోసగాడు శీను, ఆయన ఫ్రెండ్స్ కు పావ్ బాజి పెట్టుకోవడానికి సాయం చేస్తున్నాననే సాకుతో వారిని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. అన్నను వెదకడానికి ముంబయి వచ్సిన మధుమతి(నయనతార)ని అనుకోకుండా కలుసుకున్న శీను ఆమె ప్రేమలో పడతాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని మధుమతికి చెబుతాడు. ఆ తరువాత శీను మధుమతికి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. పట్నాయక్, శీను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదనే నిజం మధుమతికి చెబుతాడు.
ఆమె తిరిగి తన స్వస్థలానికి వస్తుంది. ఇదిలా ఉండగా శీను తన మిత్రుడు చక్రిని(జెడి చక్రవర్తి)కలుసుకుంటాడు. పూజ(నేహ)ను ప్రేమిస్తున్న చక్రికి శీను సాయంతో వారు పెళ్లి చేసుకుంటారు. చక్రి, పూజలు శీను దుబాయ్ వెళ్లడానికి సాయపడతామని హామీ ఇస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తారు. వారు తిరిగి హైదరాబాద్ వద్దమని అనుకుంటుండగా తమ బాస్ మాఫియా డాన్ జిన్నా(సుశాంత్) అని తెలుసుకుంటారు. తనను గుర్తించరని తెలుసుకున్న జిన్నా, ఆయన సోదరుడు (రఘు) శీను కళ్లముందే పూజ,చక్రిలను చంపివేస్తారు. చనిపోయేముందు తనకు మధు అనే చెల్లెలు ఉందని చక్రి చెబుతాడు. శీను హైదరాబాద్ తిరిగి వచ్చి చక్రి తండ్రి చేసిన బ్యాంక్ అప్పు తీర్చి తాకట్టులో ఉన్న ఇల్లును విడిపిస్తాడు. జిన్నాను, ఆయన సోదరుడిని చంపి ప్రతీకారం తీర్చుంటాడు.
ప్లస్ పాయింట్స్- శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ, రవి తేజ నటన, నయనతార గ్లామర్ షాయాజీ షిండే, వేణుమాధవ్, కృష్ణభగవాన్, ఎంఎస్ నారాయణల కామెడీ పండింది. అప్పడం అయిపోతుంది అని హీరో అనే మాట పాపులర్ అయింది. అంతేకాదు రవితేజ తనదైన కామెడీకూడా అలరిస్తుంది. మణిశర్మ సంగీతం , భరణి కె ధరణ్ కెమరా పనితనం చాలా బావిన్నాయి. చింతపల్లి రమణ డైలాగులు పేలాయి.
మైనస్ పాయింట్స్-అవసరంలేని సీన్ లు చాలా ఉన్నాయి. ఎడిటర్ వర్మకు ఇది తొలి సినిమా కావడంతో ఆ సీన్ లు కలిసాయి. విలన్ ను ఎలివేట్ చేయడానికి చూపించిన సీన్ లు ఇబ్బందిగా ఉన్నాయి. రాజా రవీం్ద చంపడు కన్ఫూసింగ్ గా ఉంది. పృథిపవ క్యారెక్టర్ ను సరిగా మలచలేదు. మొత్తానికి సినిమా బావుంది.