రాజమౌళి కమర్షియల్ హంగులు (ద్వంద్వార్థాలు, ఎక్స్‌పోజింగ్) మేళవించినా... ఈసారి సృజనాత్మకతను ఎక్కువ గుప్పించారు. ఎన్టీఆర్‌తో యంగ్ యమధర్మరాజు గెటప్ వేయించడం... ఈ సందర్భాన్ని జొప్పించి. అది అతికినట్లుగా కాకుండా సదరు ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా గ్రాఫిక్స్ సహాయంతో కీర్తిశేషులు ఎన్టీఆర్‌ను తెరపైన మెరిపించడం... వీటన్నింటినీ మించి ఎన్టీఆర్‌లో కొత్త లుక్ తీసుకురావడం చిత్రానికి ప్లస్. కాకపోతే సినిమా నిడివి ఎక్కువై సాగదీసినట్లు అనిపించింది.
పనితీరు: నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ... ఇలా ప్రతిదానిలోనూ, అసలు సినిమా మొత్తానికే జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. లావుగా ఉన్నప్పుడు డాన్స్ ఎంత బాగా చేసినా అదంత అందంగా అనిపించేది కాదు. సన్నబడ్డాక కదలికల్లో వేగం పెరిగింది. అందుకే స్టెప్‌లు ఈజీగా వేశాడు. పెట్టుకున్న కిరీటం కాస్త పెద్దదైంది. "యువ యమధర్మరాజు" గా తన తాతను గుర్తుచేశాడు. ఇప్పటి వరకూ వేసిన పాత్రలే వేసి, చూపిన నచనే చూపిన ఎన్టీఆర్ ప్రేక్షకులకు ఈసారి రిలీఫ్ ఇచ్చాడు. మన కథానాయకులు పాటలు పాడితే వారి గాత్రాన్ని ఇట్టే కనిపెట్టేయొచ్చు.
WD Photo
WD
ఓ లమ్మీ తిక్కరేగిందా.... అంటూ ఎన్టీఆర్ పాడిన రీమీక్స్ పాట బాగుంది. యమధర్మరాజు వేషానికి మోహన్ బాబు సరితూగాడు. ఒకప్పుడు సత్యనారాయణ తర్వాత మళ్ళీ ఈయనే అనిపించాడు. అహంకారం, క్రూరత్వం, కరుకుదనం, చిలిపిదనం, హాస్యరసం, భావగర్బిత మేళవింపుగా సాగే పాత్ర ఇది. ఇన్ని రసాలనూ మోహన్‌బాబు తనదైన శైలిలో అవలీలగా పండించారు. కథానాయికగా తెలుగులో తొలి చిత్రం మమతా మోహన్‌దాస్‌కు. "ఏందబ్బాయా...! అంటూ నెల్లూరు యాసలో తనపాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. వాయిస్‌పరంగా, నటనపరంగా ధనలక్ష్మి పాత్రలో చక్కటి పెర్‌ఫార్మెన్స్ ప్రదర్శించింది.
కళాదర్శకుడు ఆనంద్‌సాయి వేసిన భారీ యమలోకం సెట్ భారీగానే ఆకట్టుకుంది. నాటి ఎన్టీఆర్ కనిపించే దృశ్యాలను గ్రాఫిక్స్ సహాయంతో సహజసిద్ధంగా తీసుకురాగలిగారు. పాటలన్నీ బీట్ పరంగా, దృశ్యపరంగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథనంలో ఎత్తుపల్లాలు గోచరిస్తాయి. సక్సెస్‌పుల్ దర్శకునిగా ముద్రపడిన రాజమౌళి చేతుల్లో రూపుదిద్దుకున్న "యమదొంగ" సక్సెస్ దొంగ అవుతాడో లేదో వేచి చూడాలి. మొత్తానికి కాలక్షేప బఠాని. మరోవైపు సెప్టంబర్ 18వరకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్‌లేకపోగా, చిరు శంకర్‌దాదా జిందాబాద్ అటూఇటూగా ఉండడంతో అప్పటివరకు పర్వాలేదు.