దైవానుగ్రహం ఉన్న దేవుని చిత్రాలు చూపినప్పుడల్లా భూలోకం వచ్చేసరికి వారన్నీ మర్చిపోవడం, మాయలు పనిచేయకపోవడం అనే లాజిక్తో చాలా సినిమాలు నడుస్తుంటాయి. "యమదొంగ"లో కూడా యముడు భూలోకంలోకి వట్టి ఎన్.టి.ఆర్‌ను మోసం చేసే క్రమంలో జరిగే పరిణామాలు అటువంటివే. ఇందులో కూడా ప్రాణాలు తీసుకురావాల్సిన అమ్మాయికి ఓ సిద్ధుడు ఇచ్చిన రుద్రాక్ష కాపాడుతుండటం అనేది శివుడ్ని వేడుకునేదాక తెలియకపోవడం. ఇక యముడు, చిత్రగుప్తులకు వయస్సు మల్లడం గదను కూడా ఎత్తలేని స్థితిరావడం అనేవి కేవలం సరదాగా కథను రాశామే తప్ప వారిని కించపరిచే ఉద్ధేశ్యం కాదని దర్శకుడు షూటింగ్ సమయంలో చెప్పడం కాస్త విమర్శకు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సంభాషణలు, ఇంద్రపాత్రధారికి అమ్మాయిలు కన్పిస్తే ఆయన వజ్రాయుధం లేచినిలబడడం అనే సంఘటనలు పంటిలో రాయిలా అనిపిస్తాయి. ఇది పూర్తిగా మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిందే. మరోవైపు యమలోకం కాన్సెఫ్ట్‌తో "యమదొంగ" ఆడుతున్నా అది క్రమేణా కలెక్షన్ల తగ్గుతుండడంతో ఈ చిత్రంపై మాస్ మొగ్గుచూపుతున్నారని పలు థియేటర్ల స్పందన. ఇక గ్రాఫిక్స్ రంగంలో ఉండడంతో యమలోకం సెట్లను, అల్లురామలింగయ్య గెటప్‌ను, స్వర్గీయ ఎన్టీఆర్‌ను, ఘంటసాలను, భారతీయుడు గెటప్‌లో కమల్‌ను చూపించగలగడం విశేషం.