"తులసి" వనంలో గందరగోళం
శనివారం, 13 అక్టోబర్ 2007( 17:31 IST )
అనంతరం వసుంధర గర్భం దాలుస్తుంది. ఆ విషయాన్ని తన తల్లితో చెప్పాలని ఇంటికి తీసుకెళ్లేవరకు తులసిది ఫ్యాక్షన్ కుటుంబమని వసుంధరకు తెలీదు. ఈ నేపథ్యంలో... జిల్లా పరిషత్ ఎన్నికల్లో తులసి తండ్రి దశరథరామయ్య (విజయకుమార్) సభ్యుల్ని రాష్ట్ర మంత్రి జయప్రకాష్ రెడ్డి దౌర్జన్యంగా కిడ్నాప్‌చేసి తన కొడుకు జితేందర్ (శ్రావణ్)కు జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవి కట్టబెట్టాలనుకుంటాడు..
మాటల్తో ఉసిగొల్పుతున్న మంత్రిని, అతని గ్యాంగును కలెక్టర్ సాక్షిగా తులసి చావ చితగ్గొడతాడు. కొంతమంది కాళ్లూ చేతులు నరికి, ఎన్నికలు జరిపించి తండ్రిని ఛైర్మన్ చేస్తాడు. తులసి ఇలా రియాక్ట్ కావడం తండ్రితోపాటు వసుంధరకు కూడా నచ్చదు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కాపురం పెట్టిన తులసి, పొరుగింటిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించడానికి వచ్చిన రవిబాబు గ్యాంగ్‌ని కూడా చితగ్గొడతాడు.
ఇదంతా వసుంధర కళ్ళ ఎదుటే జరుగుతుంది. అప్పుడే వసు బాబును ప్రసవిస్తుంది. ఇదిలా ఉండగా తన బావను కొట్టాడనే కసితో శివాజీ రియాజ్‌ఖాన్‌ను కొడితే, రియాజ్ ఖాన్ గ్యాంగ్ శివాజీని తరుముకుంటూ వస్తూ తులసి కంటిలో పడతారు. ఆ కొట్లాటలో శివాజీని రియాజ్ చంపేస్తాడు. రియాజ్‌ను తులసి చంపుతాడు. ఈ ఘటన కూడా వసుంధర కళ్ళబడుతుంది. దీంతో తులసిపై అసహ్యాన్ని పెంచుకున్న వసుంధర ఉన్న పళంగా పసిబిడ్డను తీసుకుని రైల్వేస్టేషన్‌కు బయలుదేరుతుంది.
తులసి ఎంత వారిస్తున్నా వినకుండా వసుంధర అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఐదేళ్లు గడిచిపోతాయి. వసుంధర ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లోకి తనకు ప్రాణప్రదమైన ఐదేళ్ళ కొడుకు హర్ష (అతులిత్)తో తులసి దిగుతాడు. హర్షను అత్యంత ఇష్టంగా చూసుకుంటూ ఉంటాడు తులసి. వసుంధర మాత్రం అతణ్ని దగ్గరికి రానీయదు. హర్షను తులసి అంత ప్రేమగా చూసుకోవడానికి వెనుక బలమైన ఒక కారణం ఉంటుంది.
బ్రెయిన్‌కు సంబందించిన ప్రాణసంకటవ్యాధితో హర్ష బాధపడుతూ ఉంటాడు. పిల్లవాడు ఎక్కువరోజులు బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేస్తారు. ఈ సంగతి తులసికి తెలుసుగానీ, వసుంధరకు తెలీదు. వ్యాధి సంగతి వసుంధరకు తెలియనీయకుండా తులసి బాబును ఎలా కాపాడాడు? తులసి, వసుంధర మళ్ళీ ఒక్కటయ్యారా? అనేది తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే. భార్యభర్తల అపార్థాలకు తోడుగా ఫ్యాక్షన్ గొడవలు, భూకబ్జా వివాదాలు వెరసి రక్తపాతానికి చైల్డ్ సెంటిమెంట్‌ను జోడించి సినిమాకు అన్ని హంగులు కల్పించే ప్రయత్నాన్ని దర్శకుడు చేశాడు.