గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » కథాబలంలేని "సరోజ"!
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
పాత్రల తీరు తెన్నులు...
గోపి పాత్రలో వైభవ్, స్వామి పాత్రలో చేరన్, టీవీ నటుడిగా అజయ్‌తో పాటు గణేష్ పాత్రధారులు బాగా అలరించారు. మార్నింగ్ నుంచి మళ్లీ తెల్లారేదాక జరిగే సమయంలో జరిగిన కథే ఇది. ప్రారంభంలో సాఫీగా సాగినా నలుగురు గ్యాంగ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళే సరికి కథ రక్తికట్టింది.

అక్కడ నుంచి దర్శకుడు తన ప్రతిభను కనపరిచాడు. అంతా చీకటిలో జరిగే కథ కాబట్టి కాస్త టెంపోలో సాగింది. ఏమాత్రం దాన్ని సడలించకుండా జాగ్రత్తగా పాత్రలను తీర్చిదిద్దాడు. సీరియస్‌గా సాగే గమనంలో గణేష్ పాత్రధారి సంభాషణలు ఆకట్టుకున్నాయి. కూతురు కిడ్నాప్ తర్వాత ప్రకాష్ రాజ్ నటనలో జీవించాడు.

విలన్ ఎవరనేది సస్పెన్స్‌గా సాగినా పోలీస్ అధికారి శ్రీహరి విలన్ అనే నిజాన్ని చివరి వరకు ఎక్కడా డ్రాప్ కాకుండా చూపించాడు. ఏదో సేవ చేద్దామని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరానని, ఇక్కడ నెలజీతం ఇతర అలవెన్సు మినహా ఏమీ ఉండదని, అందుకే స్నేహితుడివైన నీ దగ్గర నుంచి రూ.20 కోట్లు రాబట్టి ఎంతోమంది పేదలకు సేవచేయాలని నిర్ణయించాననే పాయింట్‌ను దర్శకుడు రవి (శ్రీహరి) పాత్ర ద్వారా చెప్పిస్తాడు.

పాయింట్ చిన్నదే అయినా ప్రేక్షకుడికి షాక్ కలుగుతుంది. అప్పటి వరకు చాలా ఇంట్రస్ట్‌గా చూసే ప్రేక్షకుడికి ఈ పాయింట్‌ గందరగోళాన్ని సృష్టిస్తుంది. సరోజను చిన్నతనంలో ఎత్తుకుని పెంచిన రవి ఇలాంటి పనికి ఎలా ఒడిగట్టాడన్నది ప్రశ్నార్థకమే? పైగా ఓ మంచి పనిచేయాలంటే మరొకర్ని చంపినా న్యాయమే అంటూ... సాటి పోలీసునే ఓ సందర్భంగా రవి చంపేయమని గ్యాంగ్‌కు సూచిస్తాడు.

కట్ చేస్తే... ఆ గ్యాంగ్ కూడా పోలీసు అధికారులే. అందరూ డిస్మిస్ అయిన వారే. కథా గమనంలో ఉన్న ఆసక్తి, కథలో లోపించడమే ఈ సినిమాకు మైనస్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శ్రీహరి ఈ సినిమాలో పోషించిన పాత్ర ద్వారా ఎంతమేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.

విశ్లేషణ..
ఇక యువన్ శంకర్ రాజా సంగీతం వినసొంపుగా ఉన్నా, పాప్ సాంగ్ ఏమాత్రం అర్థం కాదు. స్వామి నిశ్చితార్థంలో సాగిన మా "మిత్రుడికి నిశ్చితార్థం..." అనే పాటలో కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాటలోనే తమిళ ఛానల్స్‌కు వచ్చే టీవీ ఆర్టిస్టులంతా కన్పిస్తారు. రాధిక కూడా ఫంక్షన్‌కు వచ్చినట్లు చూపిస్తారు.

నిశ్చితార్థం చేసుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ పాటకే పరిమితం. సంపత్ గ్యాంగ్‌ను అలరించే వ్యాంప్ పాత్రలో నిఖిత నటించింది. బ్రహ్మానందం రోడ్డు ప్రయాణంలో కాసేపు నవ్విస్తాడు. మినహా మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మొత్తం నలుగురు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది.

ఆ పాత్రలతోనే కాసేపు హాస్యం, సీరియస్ చొప్పించడంలో దర్శకుడు మెప్పించాడు. ఎందరికో మంచి చేయాలనే ఉద్దేశంతో స్నేహితుడి కూతుర్నే కిడ్నాప్ చేసే పోలీసు అధికారిగా శ్రీహరి ఏ మేరకు ప్రేక్షకులను మెప్పు పొందుతాడో చూడాల్సిందే... స్క్రీన్‌ప్లేను వెంకట్ ప్రభు చక్కగా మలిచాడు. వైవిధ్యం కోసం పరితపించే ప్రేక్షకులకు ఈ చిత్రం ఓకే...!
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష సరోజ కథాబలం నటీనటులు శ్రీహరి ప్రకాష్ రాజ్ కాజల్ అగర్వాల్