"16డేస్"లో ఏం జరిగింది?
తారాగణం.. అరవింద్, ఛార్మీ, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు, రామిరెడ్డి తదితరులు.
కెమేరా.. సుకుమార్,
సంగీతం.. ధరణ్,
దర్శకత్వం.. ప్రభు సాల్మన్.
పాయింట్.. 16 రోజుల్లోనే పగ తీర్చుకోవడం.
టాలీవుడ్‌లో అంకెలమీద చిత్రాలు రావడం చాలా తక్కువ. అలనాడు చిరంజీవి "47 రోజులు" చిత్రం ఒక ఎత్తయితే.. ఈ "16డేస్" చిత్రం మరో ఎత్తు. సహజంగా మదరాసీయులు కర్మకాండలు 16 రోజులు చేసుకుంటారు. ఆ 16వ రోజు వరకు జరిగే కథే ఈ చిత్రం. ఈ చిత్రం చూస్తుంటే.. హాలీవుడ్ తరహా చిత్రాలు కొన్ని స్ఫురిస్తాయి. తెలుగులో జగపతిబాబు "గాయం" ఛాయలు కూడా కనిపిస్తాయి.
అసలు విషయం చెప్పాలంటే.. ఈ చిత్రాన్ని తమిళంలో "లాడమ్" అనే పేరుతో తీశారు. తెలుగులో దీనిని అనువదించి, కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు. ఇందులో ఛార్మీ ప్రధాన పాత్రగా ప్రచారం చేశారు. కానీ కథంతా హీరో అరవింద్ చుట్టూ తిరుగుతుంది. వ్యాపారరీత్యా ఛార్మీని ఎక్స్‌పోజింగ్‌కు ఉపయోగించుకున్నారు. దానికి ఆమె తగిన పారితోషికం కూడా పుచ్చుకుంది.
ఇక కథలోకి వెళితే.. ఉద్యోగం కోసం విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చే గురుమూర్తి (అరవింద్) అనుకోకుండా ఓ మాఫియా ముఠాకు చిక్కుతాడు. ఈ మాఫియా ముఠాకు యాదగిరి (కోటశ్రీనివాసరావు) నాయకుడు. యాదగిరి ప్రత్యర్థి కొడుకును చంపాలన్న ప్లాన్‌తో, పొరబాటున గురుమూర్తిని పట్టుకొస్తారు ఆ ముఠాసభ్యులు.
దీన్ని గ్రహించిన గురుమూర్తి, తను ఆ మాఫియా ముఠా నుంచి బయటపడాలని తెలివిగా ఆలోచిస్తాడు. దీంతో యాదగిరి ప్రత్యర్థి కొడుకును చంపేందుకు గురుమూర్తి ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా యాదగిరికి నచ్చి, ఆ పనిని గురుమూర్తికే అప్పగిస్తాడు. సలహా ఇచ్చి ఇరుక్కున్న గురుమూర్తినే ఆ పనిని చేయమని, లేదంటే చంపేస్తానని యాదగిరి హెచ్చరిస్తాడు.
ఇక.. యాదగిరి ప్రత్యర్థి రామిరెడ్డి విషయానికొస్తే.. అతడు స్వార్థపరుడు. రామిరెడ్డి, యాదగిరిలిద్దరూ ఒకరి చావును ఒకరు కోరుకునే రకం. రామిరెడ్డి కొడుకును చంపేందుకు యాదగిరి ముఠా నుంచి బయటపడిన గురుమూర్తి, అనుకోకుండా రామిరెడ్డి మనుషులకు చిక్కుతాడు.
ఇంకేముంది.. యాదగిరిపై ఉన్న కోపంతో గురుమూర్తిని రామిరెడ్డి మనుషులు సజీవంగానే పాతిపెడతాడు. అయితే గురుమూర్తి ఆ ప్రమాదం నుంచి తెలివిగా బయటపడతాడు. ఈ విధంగా రామిరెడ్డి ప్రత్యర్థి కుమారుడిని చంపాలనే పనిమీద బయటపడిన అరవింద్‌కు ఏంజెల్ (ఛార్మి) పరిచయమవుతుంది. ఆమె ఓ అనాథ. ఇద్దరూ ఒకరి కథను మరొకరు చెప్పుకుంటారు.
ఇలా.. ఏంజెల్‌కు దగ్గరైన అరవింద్‌కు ఉన్నట్టుండి యాదగిరి అప్పగించిన బాధ్యత గుర్తుకు వస్తుంది. అతనిచ్చిన 16 రోజులు దగ్గరపడుతుంటాయి. ఆ సమయంలో గురుమూర్తి ఏం చేశాడు? ఏంజెల్ ఏవిధంగా తోడ్పడింది..? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ.. అరవింద్ కొత్తవాడైనా పాత్రకు సరిపోయాడు. అమాయకత్వం, ఆవేశం కలగలిపిన పాత్రలను బాగానే పోషించాడు. అందరూ హైలైట్‌గా ఉంటుందనుకున్న ఛార్మీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అరవింద్ కష్టాలకు తోడుగా ఉండే సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. బైక్ డ్రైవింగ్, డాన్స్ చేస్తుందే తప్పనిస్తే సినిమాకు ఏ మాత్రం అవి తోడ్పడలేదు. మొదటి నుంచే ఆమె పాత్ర ప్రముఖ హీరోలను ఇమిటేట్ చేస్తుందని చెప్పారు. అవన్నీ కృతంగా ఉన్నాయి.
ఇకపోతే.. కోట శ్రీనివాసరావు మాఫియా లీడర్‌గా బాగా సూటయ్యాడు. కామెడీపరంగా ధర్మవరపు మినహా మిగిలిన వారంతా తమిళులే. ధరణి సంగీతం, బాణీలు బాగానే ఉన్నాయి. ప్రభుసాల్మన్ స్క్రీన్‌ప్లేలో విఫలమయ్యాడు. కొన్ని సందర్భాలు సందర్భానుసారంగా ఉండవు. తొలి అర్ధభాగంలో ఉన్న స్పీడ్, సెకండాఫ్‌లో లోపించింది. మొత్తానికి ఈ సినిమా తమిళులకు నచ్చుతుందేమోగానీ.. తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు "16డేస్"ను ఆదరిస్తారో వేచి చూడాల్సిందే..!
కెమేరా.. సుకుమార్,
సంగీతం.. ధరణ్,
దర్శకత్వం.. ప్రభు సాల్మన్.
పాయింట్.. 16 రోజుల్లోనే పగ తీర్చుకోవడం.
టాలీవుడ్‌లో అంకెలమీద చిత్రాలు రావడం చాలా తక్కువ. అలనాడు చిరంజీవి "47 రోజులు" చిత్రం ఒక ఎత్తయితే.. ఈ "16డేస్" చిత్రం మరో ఎత్తు. సహజంగా మదరాసీయులు కర్మకాండలు 16 రోజులు చేసుకుంటారు. ఆ 16వ రోజు వరకు జరిగే కథే ఈ చిత్రం. ఈ చిత్రం చూస్తుంటే.. హాలీవుడ్ తరహా చిత్రాలు కొన్ని స్ఫురిస్తాయి. తెలుగులో జగపతిబాబు "గాయం" ఛాయలు కూడా కనిపిస్తాయి.
అసలు విషయం చెప్పాలంటే.. ఈ చిత్రాన్ని తమిళంలో "లాడమ్" అనే పేరుతో తీశారు. తెలుగులో దీనిని అనువదించి, కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు. ఇందులో ఛార్మీ ప్రధాన పాత్రగా ప్రచారం చేశారు. కానీ కథంతా హీరో అరవింద్ చుట్టూ తిరుగుతుంది. వ్యాపారరీత్యా ఛార్మీని ఎక్స్‌పోజింగ్‌కు ఉపయోగించుకున్నారు. దానికి ఆమె తగిన పారితోషికం కూడా పుచ్చుకుంది.
దీన్ని గ్రహించిన గురుమూర్తి, తను ఆ మాఫియా ముఠా నుంచి బయటపడాలని తెలివిగా ఆలోచిస్తాడు. దీంతో యాదగిరి ప్రత్యర్థి కొడుకును చంపేందుకు గురుమూర్తి ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా యాదగిరికి నచ్చి, ఆ పనిని గురుమూర్తికే అప్పగిస్తాడు. సలహా ఇచ్చి ఇరుక్కున్న గురుమూర్తినే ఆ పనిని చేయమని, లేదంటే చంపేస్తానని యాదగిరి హెచ్చరిస్తాడు.
|