Seetaramula Kalyanam Lankalo Cinema Review | Nitin | Hansika | Suman | Sunil Pandey | సీతారాముల కల్యాణం.. లంకలో... చూస్తారా...?
WD
ఈ చిత్రం గురించి చెప్పాలంటే... ఆంధ్ర, తెలంగాణా గురించి ఓ ముక్క చెప్పాలి. కోస్తాంధ్రకు చెందిన ఎమ్మెల్యే ఈ సినిమాను తెలంగాణా హీరోను పెట్టి నిర్మించారు. తెలంగాణా హీరోగా నితిన్ ఎప్పటి నుంచో గజినీ దండయాత్రలా విజయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఎటొచ్చీ తెలంగాణా ఇష్యూ వల్ల ఈ సినిమా వాయిదాపడుతూ శుక్రవారం విడుదలైంది.
గురువారం రాత్రి నుంచే ఈ చిత్రం హిట్ అనే టాక్, బాక్స్‌లు బయటకు వచ్చే ల్యాబ్స్‌లో వినబడ్డాయి. మార్నింగ్ షో అనుకన్నట్లుగానే విపరీతమైన ఓపెనింగ్స్ కూడా తోడయ్యాయి. కానీ రెండోరోజు షడెన్‌గా తగ్గిపోయాయి. మొదటి నుంచి నితిన్ చెబుతున్నట్లుగానే పాత కథే. చెప్పే విధానం కొత్తగా ఉంటుంది అన్నాడు. సినిమా కూడా అలాగే ఉంది.
కథలోకి వెళితే... సాహసవంతమైన పనులు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకునే చందు (నితిన్) అతను చదివే కాలేజీ అమ్మాయిపై నిలుస్తాయి. ఆమెనే గట్టిగా ప్రేమిస్తాడు. ఆమె తండ్రి పెద్దిరెడ్డి (సుమన్) పక్కా ఫ్యాక్షనిస్టు. ఇక ఫ్యాక్షనిస్టు అనగానే ప్రత్యర్థివర్గం ఉంటూనే ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వీరప్రతాప్ రెడ్డి( సునీల్ పాండే)తో వైరముంటుంది. దాంతో పెద్దిరెడ్డి కుమార్తె అయిన నందిని( హన్సిక)ని రామాయణంలో రావణాసురుడిలా మాయచేసి లాక్కెళ్తాడు. అది గ్రహించిన చందు ఆమెను ఎలా రక్షించాడు. తన దానిగా ఎలా సాధించుకున్నాడు..? ఈ క్రమంలో ఆయన చేసిన పోరాటాలు.. డాన్స్‌లు ఏమిటి...? అనేది సినిమా.
ప్రధానంగా చెప్పుకోవాల్సింది నితిన్ గురించే. డాన్స్‌లు బాగానే చేస్తాడనే పేరుంది. దానికి తగ్గట్లు బాడీని కూడా మార్చుకుంటాడు. రెండు పాటలకు థియేటర్లో చప్పట్లు మారుమోగాయి. ఇక హన్సిక తన పాత్ర మేరకు నటించింది. వయ్యారాలు బాగానే ఒలకబోసింది. సుమన్ ఫ్యాక్షనిస్టుగా బాగానే సూటయ్యాడు. ఆవేశం, సెంటిమెంట్ కోణాలను బాగా పండించాడు. జయప్రకాష్ రెడ్డి తన రొటీన్ నైజాన్ని ప్రదర్శించాడు. ఎటొచ్చీ సునీల్ పాండే నటనకంటే కేకలు ఎక్కువయ్యాయి.
అనూప్ సంగీతం బాగానే ఉంది. "కిస్ మీ.. కమ్ విత్‌మీ" పాట బాగానే చేశాడు. మరో రెండు పాటలు అలరించాయి. సంభాషణలపరంగా ఈశ్వర్ కూడా బాగా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సిద్దు ఫ్రమ్ సీకాకుళం చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఈ చిత్రాన్ని తీసి సక్సెస్ సాధిస్తానని ప్రారంభంలో ధీమా వ్యక్తం చేసినా.. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే.
