1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. సమీక్ష
  6. Rajendra Prasad

Brahma lokam to yama lokam via bhulokam cinema review | Rajendra Prasad | Shivaji | Kalyani | Sonia | Arthi Agarwal | మాస్‌ను అలరించే "బ్రహ్మలోకం టు యమలోకం.."

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
WD
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శివాజీ, కల్యాణి, సోనియా, లయ, ఆర్తీ అగర్వాల్, జయప్రకాష్ రెడ్డి, వేణు మాధవ్, రఘుబాబు, అశోక్ కుమార్, గుండు సుదర్శన్ తదితరులు

సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, రూపేష్, డి. గోహిల్, గ్రాఫిక్స్: జెమినీ ఎఫ్ఎక్స్, దర్శకత్వం: గోళ్లపాటి నాగేశ్వరరావు
విషయం: అందరి తల రాతలు రాసేది బ్రహ్మ అయితే, భక్తునికోసం తన తల రాతను మార్చుకునే కథ.

పురాణాలు, ఇతిహాసాలు వంటి అంశాలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. పురాణాలను నేటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చే సోషియో ఫాంటసీలు కూడా వచ్చాయి. ఇవన్నీ ప్రేక్షకుల్ని కాసేపు ఊహాలోకాల్లోకి తీసుకెళ్ల మైమరిపిస్తాయి. అయితే గతంలో బ్రహ్మదేవునిగా మూడు తలలను మాత్రమే పెట్టేవారు. ఈ చిత్రం ప్రత్యేకతంతా ఎఫ్ఎక్స్ వారు అసలైన తలలతో చేసిన ప్రక్రియ ఆకట్టుకుంది. ఈ కథ పూర్తి మాస్‌ను దృష్టిలో పెట్టుని రాసుకున్నట్లుంది.

కథ: సరస్వతీ మాత పక్కనే జనుల తలరాతలు రాసే పనిలో బ్రహ్మ ఉండగా నారుదుడు ప్రవేశిస్తాడు. శివుడు, విష్ణుమూర్తి తమ భార్యలతో కాలక్షేపం చేస్తున్నట్లు మిమ్మల్ని కూడా చూడాలనుందని సరస్వతికి విన్నవిస్తాడు. నిజమేననిపిస్తుంది. అయితే ఒక్క నిమిషం పని ఆగినా భూలోకం స్తంభిస్తుందని ఓ ఉదాహరణతో నిరూపిస్తాడు బ్రహ్మ. అయినా సరస్వతి అలుగుతుంది. అయితే పెళ్లి ఎందుకు చేసుకున్నావంటూ... ప్రశ్నిస్తుంది. వివాహమైతే మరణమే కదా.. అంటూ యాదృశ్చికంగా ఎవరో తలరాత రాస్తూ బ్రహ్మ సెలవిస్తాడు.

కట్ చేస్తే... భూలోకంలో శీను(శివాజీ) డిగ్రీని ఐదారేళ్లుగా చదువుతూ ఉంటాడు. అదన్నా పూర్తి చేస్తే అతనికి పెళ్లి చేయాలనుకుంటుంది అతని తల్లి. వయసు పైబటంతో కనబడిన అమ్మాయికల్లా లవ్ లెటర్ రాసేస్తాడు శీను. తల్లికి ఇదొక న్యూసెన్స్‌గా ఉంటుంది. శీను కాలేజీలో చదివే శ్వేత(సోనియా)ను ప్రేమిస్తున్నానని వెంటబడతాడు. ఆల్రెడీ ఆమె బావ ఆమెను ఆస్తికోసం పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. అడ్డు వచ్చిన శీనుని చంపేస్తానంటాడు.

ఇదిలా ఉండగా, శీను ఫ్రెండ్ శోభన్ బాబు( వేణు మాధవ్). పెట్రోల్ బంకు ఉందని అబద్ధం చెప్పి లక్ష్మిని పెండ్లి చేసుకుంటాడు. అబద్ధమని తెలిసి అత్త తెలంగాణా శకుంతల మొదటి రాత్రి జరుగనీయదు. ఎలాగైనా డబ్బు సంపాదించి మొదటి రాత్రి చేయాలని ఫ్రెండ్ ఇచ్చిన సూచనతో కేరళ అడవుల్లో తపస్సుకు వస్తాడు. దొడ్డి దారిన త్వరగా దేవుడు ప్రత్యక్షం కావాలంటే బ్రహ్మ ఒక్కడే మార్గమని తోటి స్వాములు చెప్పినట్లుగా "ఓం బ్రహ్మదేవాయనమః" అంటూ చేస్తాడు.

శోభన్ బాబు తపస్సుకు బ్రహ్మ ఆశ్చర్యపోయి భూమికి దిగివచ్చి అతడి భక్తికి మెచ్చి ఏం కావాలో కోరుకో అంటాడు. డబ్బులు అడుగుతాడు. అది తన పనికాదని చెప్పడంతో... నుదిటి రాతను చదివే శక్తిని ప్రసాదించమంటాడు. దాని ద్వారా జాతకాలు చెప్పి బతికేస్తానంటాడు. వెంటనే ఓ పాత్ర ఇచ్చి ఇందులో ఉన్న పాలను స్నానం చేశాక తాగమని చెప్పి మాయమైపోతాడు. మరోవైపు సోనియాను వెతుక్కుంటూ శీను కేరళ వస్తాడు. ఇదే అవకాశమని శీనును శ్వేత బావ పొడిచి అక్కడే లోయలో విసిరేస్తారు. కింద పడిన శీను ఎదురుగా కనబడుతున్న చెంబును చూసి దాహంతో తాగుతాడు.

WD
అంతే... కత్తిపోట్లు మాయమైపోతాయి. తెలీని శక్తి వస్తుంది. ఇక స్నానం చేయడానికి వెళ్లిన శోభన్ బాబు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని బావురుమంటాడు. శీనుకు ధైర్యం చెప్పి తలరాతలు చదివే విద్యతో కోట్లు సంపాదించవచ్చని సూచిస్తాడు. అలా కోట్ల రూపాయల టెండర్‌ను ఎవరికి వస్తుందో తెలుసుకుని అతని ద్వారా కమీషన్ రూపేణా కోట్లు సంపాదిస్తాడు. అలా కోటీశ్వరులవుతారు.

అయితే తలరాతలు విద్యతో కాసేపట్లో చనిపోయే 30మందిని కాపాడుతాడు శీను. యమభటులు వచ్చి ఇది సృష్టికి విరుద్ధమని తెలిసి యముడికి విన్నవిస్తారు. విషయం తెలిసిన యముడు బ్రహ్మ వద్దకు వెళతాడు. తాను ఇచ్చిన వరంతో మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడని ఆ వరాన్ని నిర్వీర్యం చేయాలని భూమిపైకి వస్తాడు. అలా రంభ ( ఆర్తీ అగర్వాల్) కూడా వస్తుంది. ఆ తర్వాత ఏమైంది..? అనేది సినిమా.

చెప్పుకోవాల్సింది కథ. ప్రధాన పాత్రలు బాగున్నాయి. బ్రహ్మగా నాలుగు తలలతో రాజేంద్రప్రసాద్‌ను చూపించే విధానం గ్రాఫిక్స్ ద్వారా హైలెట్‌గా ఉంది. బ్రహ్మ పాత్ర కృతకంగా లేదు. ఆయన తన పాత్రకు న్యాయం చేశాడు. యముడిగా జయప్రకాష్ రెడ్డి, చిత్రగుప్తుడిగా ఏవీఎస్ బాగానే ఉన్నారు. వేణు మాధవ్ పాత్రే నవ్వు తెప్పిస్తుంది. అది పూర్తి మాస్‌ను దృష్టిలో పెట్టుకుని మలిచిన పాత్ర. పెండ్లి, శోభనం చుట్టూనే ఆయన పాత్ర తిరుగుతుంది. ఇక శివాజీ పాత్రలో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఆయనలో హావభావాలు పెద్దగా కన్పించవు. ఏదో సరదాగా చేసేస్తుంటాడు. మిగిలిన పాత్రలు బాగానే ఉన్నాయి.

ప్రధానంగా చెప్పాల్సింది టెక్నికల్ వర్క్. అదే సినిమాకు ప్రాణం. చిన్న సినిమా అయినా టెక్నాలజీతో బాగా మలిచారు. ఇందులోని నాలుగు పాటలు బాగున్నాయి. నిన్ను చూసి ఫ్లాట్ అయ్యానే... నాక్కొంచెం దూకుడెక్కువ.. పాటలు యువతను గిలిగింతలు పెట్టిస్తాయి. ఆర్తీ అగర్వాల్ రంభగా నటించింది. శీనుతో జత కట్టేందుకు చేసే విధంగా ప్రేరేపిస్తుంది. అయినా అందులో పెద్దగా అసభ్యత లేదు.

రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు మాటల్లో కూడా కేర్ తీసుకున్నాడు. అవతార పురుషులు భూలోకం వస్తే వారు కూడా గత జన్మ పాపాలకు అనుభవించే విధానం గూర్చి వివరణ బాగుంది. కానీ కొన్ని లాజిక్కులేని సన్నివేశాలున్నాయి. అవన్నీ ప్రక్కనపెడితే... పక్కా మాస్ సినిమా ఈ బ్రహ్మలోకం...
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి