తరుణ్ ఇలియానా... ట్రెయిలర్
Publish: Wed, 19 Mar 2008 (15:29 IST)
Updated: Wed, 19 Mar 2008 (15:27 IST)
శ్రీలక్ష్మీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లవర్‌బోయ్ తరుణ్ హీరోగా నటించిన 'భలేదొంగలు' చిత్రం కె విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. సెక్సీభామ ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పించగా... పాండురంగారావు నిర్మిస్తున్నారు. కేఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.హీరో జగపతిబాబు పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్‌డూపర్ హిట్టయిన బంటీ ఔర్ బబ్లీ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేమ కథాంశానికి ఈ నాటి ట్రెండ్‌లతో పాటు మత్తెక్కించే ఇలియానా అందాల ఆరబోతను దర్శకుడు చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి చెందిన దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT