ట్రెయిలర్‌లో... ప్రేమాభిషేకం
|
విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని వేణునే నిర్మించటం. ఇక 1981లో వచ్చిన ప్రేమాభిషేకంలో అక్కినేని నాగేశ్వరరావు తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేశారు. అంతటి అభిమానాన్ని చూరగొన్న ఈ చిత్రాన్ని నేటి సరికొత్త ఒరవడిని జోడించి.. వినోదరసభరితంగా రూపొందించారు.
అయితే అప్పటి ప్రేమాభిషేకం చిత్రంలో హీరోకు క్యాన్సర్ ఉంటే.. ఇప్పటి ప్రేమాభిషేకంలో హీరోకు క్యాన్సర్ ఉంటుందా... అసలు అతను ఏమవుతాడు అనే అంశంపై కథ నడుస్తుంది. ఈ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడండి.
