1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

జాన్ అప్పారావు 40+.. ట్రెయిలర్

జాన్ అప్పారావు 40+ ట్రెయిలర్ సిమ్రాన్ కృష్ణ భగవాన్
WD
కూచిపూడి వెంకట్ దర్శక, నిర్మాతగా రూపొందిన జాన్ ఆప్పారావు 40+ చిత్రాన్ని శ్రీవరసిద్ధి వినాయక సమర్పణలో బ్లాక్ అండ్ వైట్ యాక్ట్ పతాకంపై చిత్రీకరించారు. కృష్ణభగవాన్, సిమ్రాన్ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి వారణాసి కిరణ్ సంగీత బాణీలను సమకూర్చారు.

కుటుంబ బాధ్యతలను కలిగి ఉండి నలభై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకని.. అనంతరం తన జీవిత భాగస్వామి కోసం పాట్లు పడే ఫ్యాషన్ డిజైనర్ కథే ఈ చిత్రం. ఇందులో బడా వ్యాపారవేత్తగా సిమ్రాన్ నటించింది. కొన్ని సన్నివేశాలు అంతగా రుచించకపోయినప్పటికీ.. టోటల్ చిత్రం పరంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యమాలికలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT