1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో... కృష్ణ

ట్రెయిలర్ కృష్ణ రవితేజ త్రిష విజయవాడ
WD
లక్ష్మీ నరసింహా విజువల్స్ పతాకంపై రూపొందిన 'కృష్ణ' చిత్రం వివి.వినాయక్ దర్శకత్వంలో చిత్రీకరించబడింది. హీరో రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని బి.కాశీ విశ్వనాథం నిర్మించగా, డివివి.దానయ్య సమర్పించారు. చక్రి సంగీతాన్ని సమకూర్చారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ఈ కథకు బ్యాక్ డ్రాప్‌గా నడుస్తుండటంతో 'ది పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి' అన్న క్యాప్షన్‌ని జోడించారు. ఇతివృత్తం పాతదే అయినప్పటికీ... చిత్రీకరించిన విధానంలో వైవిధ్యం ఉండటంతో ఈ చిత్రం మంచి మార్కులు కొట్టేసింది.

తను ప్రేమించిన యువతి కోసం హీరో చేసిన ఛేజింగ్స్... ఎమోషన్స్... డైలాగ్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT