ట్రెయిలర్‌లో... ''కాళిదాసు''
|
'దేవదాసు' మనవడు 'కాళిదాసు' వచ్చేస్తున్నాడంటూ ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో పేరుతెచ్చుకోవటం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఏర్పటు చేసిన భారీ హోర్డింగ్స్ తమాషాగా.. అందరిని ఆకట్టుకుంటున్నాయి. 'కాపాడండి.. కాళిదాసు బారి నుంచి కాపాడండి బాబోయ్' అంటూ భారీ హోర్డింగ్స్, స్లోగన్స్‌తో చూపరుల మనసులో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ చిత్ర హీరోకిది తొలి చిత్రం కాబట్టి సహజంగానే.. ప్రేమ కథను ప్రధానంగా చిత్రీకరించారు. వీటికి కమర్షియల్ పరంగా కొన్ని ఎలిమెంట్స్‌ను కూడా కలిపి వైవిధ్యంగా చిత్రీకరించినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. 'కాళిదాసు' చిత్ర టైటిల్‌కు 'వీడికి చేతి వాటం ఎక్కువ' అంటూ ఓ క్యాప్షన్ జోడించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యమాలికలను ట్రెయిలర్‌లో చూడండి.
