1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

''పరుగు'' ట్రెయిలర్ మీకోసం...

పరుగు ట్రెయిలర్ అల్లు అర్జున్
WD PhotoWD
అల్లు అర్జున్,షీలా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'పరుగు'. 'దేశముదురు' చిత్రం తర్వాత భారీ అంచనాలతో అల్లు అర్జున్ నటించిన చిత్రం ఈ 'పరుగు'.

తండ్రీ కూతుళ్ల మధ్య సంబంధాలను చక్కగా తెరకెక్కించిన ఈ చిత్రం కథ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన కొన్ని సంఘటనలను పోలి ఉందన్న ప్రచారం జరిగింది. అయితే దర్శక, నిర్మాతలు ఈ విషయాన్ని కొట్టిపారేశారు.

కంటికి రెప్పలా పెంచిన కూతురు పెళ్లి నిశ్చియించిన సమయంలో ఇంటినుంచి పారిపోతే ఆ తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుదన్న పాయింట్‌ను దర్శకుడు భాస్కర్ చక్కగా చూపించారని కొందరు ఈ చిత్రాన్ని అభినందించారు.

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అల్లు అర్జున్ అభిమానులతో కొద్ది సమయం గడిపేలా ఓ విన్నూత్న కార్యక్రమానికి సైతం ఈ చిత్ర యూనిట్ ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్ని విశేషాలు కలిగిన ఈ పరుగు చిత్రంలోని కొన్ని దృశ్యాలు మీ కోసం...