1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో ''బుజ్జిగాడు''

ట్రెయిలర్‌ బుజ్జిగాడు ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్‌గా
WD PhotoWD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం 'బుజ్జిగాడు' మేడ్ ఇన్ చెన్నై అనేది ఈ చిత్రం ఉపశీర్షిక.

త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మోహన్‌బాబు సైతం ఓ ప్రత్యేకపాత్రలో నటించడం విశేషం. రజనీకాంత్‌ను విపరీతంగా అభిమానించే ఓ కుర్రాడి పాత్రలో ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల చెన్నైలో రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైంది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడుతా' చిత్రానికి సంగీతాన్ని అందించిన సందీప్ చౌతా చాలాకాలం తర్వాత తెలుగులో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం.

త్రిష గ్లామర్ పాత్రలో, పూరి జగన్నాథ్ మార్క్‌తో తెరకెక్కిన బుజ్జిగాడు చిత్రంలోని కొన్ని సుందర దృశ్యాలు మీ కోసం అందిస్తున్నాం వీక్షించండి మరి.