ఉల్లాసంగా... ఉత్సాహంగా ట్రెయిలర్
|
అటుపై పలు హిట్ చిత్రాలకు దర్శకునిగా పనిచేసిన కరుణాకర్ ప్రస్తుతం కొత్తవాళ్లతో ఈ ఉల్లాసంగా... ఉత్సాహంగా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తేజ, ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు విచ్చేసి చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు, సునీల్, వేణుమాధవ్, రఘుబాబు, ఎల్.బి.శ్రీరామ్, అనంత్, సుమన్‌శెట్టి తదితరులు నటించారు.
జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని కొన్ని మధురమైన సన్నివేశాలు మీకోసం...
