1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

మీకోసం ట్రెయిలర్ 'రెడీ'

మీకోసం ట్రెయిలర్ రెడీ
WD PhotoWD
రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం రెడీ. ఢీ చిత్రం తర్వాత జెనీలియా, శ్రీనువైట్ల దర్శకత్వం వస్తున్న చిత్రం ఇది. అలాగే దేవదాసు, జగడం చిత్రాల తర్వాత రామ్ నటిస్తున్న మూడో చిత్రం ఈ రెడీ.

దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో సోమవారం విడుదలైంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలో రామ్, జెనీలియా జంట చాలా చూడముచ్చటగా ఉంటుందని, తన గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చెబుతున్నారు.

యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దేనికైనా రెడీ అనే ఓ చురుకైన యువకుని పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం.