1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ఘటోత్కచుడు 23న వస్తున్నాడు

ఘటోత్కచ యానిమేషన్ చిత్రం 23న విడుదల
WD
పురాణగాథలను యానిమేషన్ చిత్రాలుగా మలిచి ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో ఈసారి ఘటోత్కచ యానిమేషన్ చిత్రం కనువిందు చేయనుంది. ఈ చిత్రాన్ని ఈనెల 23 తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వెల్లడించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాయాబజార్ చిత్రం ద్వారా నా కెరీర్ ప్రారంభమైందని చెప్పారు. యాభై ఏళ్ల తర్వాత అదే చిత్రాన్ని యానిమేషన్ చిత్రంగా మలచడానికి నిర్మాతలు స్మిత మారూ, వినోద్ సూర్యదేవ ముందుకువచ్చారన్నారు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించామనీ, చిత్రం 2డిలో ఉంటుందనీ, పాటలు 3డిలో ఉంటాయనీ చెప్పారు.

100 నిమిషాలు నిడివిగల ఈ చిత్రం యానిమేషన్‌వర్క్‌ను ఫిలిప్పైన్స్, టొరోంటో, యు.కె, చెన్నై, హైదరాబాదులలోని యానిమేటర్లు రూపకల్పన చేశారు. అంతా కంప్యూటర్ లోనే 48 కెమేరాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి