1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో పాండురంగడు

ట్రెయిలర్‌లో పాండురంగడు బాలకృష్ణ పాండురంగడు చిత్రాన్ని
WD PhotoWD
భక్తిరస ప్రధాన చిత్రాలకు తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పాండురంగడు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ పాండురంగ మహత్యంలో నటించి అశేష తెలుగు ప్రేక్షకులు మన్ననలు అందుకున్నారు. మళ్లీ ఆయన కుమారుడు బాలకృష్ణ పాండురంగడు చిత్రాన్ని చేయటం చేయటం విశేషం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్నేహ నటిస్తుండగా, టబు వేశ్య పాత్రలో నటిస్తోంది.

అలాగే మోహన్‌బాబు సైతం ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి స్వరపరచిన చిత్ర గీతాలు ఆకట్టుకున్నాయి. పాండురంగడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం.