1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో ''బుజ్జిగాడు''ని వీక్షించండి

ట్రెయిలర్‌ బుజ్జిగాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్
FileWD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బుజ్జిగాడు'. 'మేడ్ ఇన్ చెన్నై' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఆంధ్రాలో పుట్టి చెన్నైలో 12 ఏళ్లపాటు పెరిగిన బుజ్జిగాడుగా ప్రభాస్ నటన ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రభాస్ డైలాగ్ డెలవరీ ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మోహన్‌బాబు ఈ చిత్రంలో ఓ ప్రత్యేకపాత్ర పోషించడం విశేషం.

వీరితోపాటు కోటశ్రీనివాసరావు, సునీల్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, ఎమ్మెస్ నారాయణ, అజయ్ తదితరులు ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథతో తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం.
About Writer
Munibabu