బ్లాక్ అండ్ వైట్ ట్రెయిలర్
Publish: Thu, 26 Jun 2008 (15:43 IST)
Updated: Thu, 26 Jun 2008 (15:42 IST)
రాజీవ్‌కనకాల, సింధూతులానీ జంటగా 'బ్లాక్ అండ్ వైట్' చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీషాఫ్ర్ ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ వైవాహిక జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనల నేపథ్యంలో చిత్ర కథ నడుస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో జాకీషాఫ్ర్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ఉత్తేజ్, అలీ, షకీలా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT