1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

యాక్షన్ కింగ్ అర్జున్ "రాణా" ట్రైయిలర్

యాక్షన్ కింగ్ అర్జున్ రాణా ట్రైయిలర్
WD PhotoWD
యాక్షన్ హీరో అర్జున్ హీరోగా నటిస్తున్న "రాణా" చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వరాభిషేకం' పరాజయం అనంతరం విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో, యాక్షన్ హీరో అయిన అర్జున్‌ను సున్నితమైన భావోద్వేగాలకు పట్టం కడుతారో... లేదో... అన్న విషయం వేచి చూడాల్సిందే.

దర్శకుడు కె. విశ్వనాథ్.. అర్జున్.. కాంబినేషన్ వాస్తవానికి చాలా విచిత్రమైనదే గానీ ఇద్దరిలోనూ ఉన్న గొప్ప గుణం ఏమిటంటే డెడికేషన్ మాత్రమే. అదే వారిని దగ్గరికి చేసినట్లుంది. అయితే.. ఇక, అర్జున్ భారతీరాజా డైరక్ట్ చేసిన డబ్బింగ్ చిత్రం 'రాణా' ద్వారా కనిపించబోతున్నారు.

దర్శకుడు విశ్వనాథ్ తాను తయారుచేసుకున్న లైన్ ఒకదానిని అర్జున్‌కి వినిపించారు. నచ్చిన అర్జున్ పూర్తి ట్రీట్ మెంట్ వెర్షన్ వినటానికి ఆసక్తి చూపారట!.. అర్జున్‌కు సబ్జెక్టు ఎంతగా నచ్చిందో తెలుసా...? ఈ చిత్రానికి అతనే ప్రొడ్యూస్ చేస్తాన్నానని చెప్పాడట మరీ.

అయితే ఈ కథకి ఆల్‌రెడీ నిర్మాతలు ఉండటంతో అది జరగక పోయింది. మొత్తానికి కె.విశ్వనాధ్ చాలా గ్యాప్ తీసుకుని చేయబోతున్నఈ సినిమాలో అర్జున్ నటించటంతో గ్యారంటీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అర్జున్ "రాణా"లోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీ కోసం...