1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

హరేరామ్ ట్రెయిలర్

హరేరామ్ ట్రెయిలర్ కళ్యాణ్ రామ్ ప్రియమణి
WD
కళ్యాణ్ రామ్, ప్రియమణి జోడీగా నటిస్తున్న హరే రామ్ చిత్రం ఆడియో విడుదల ఈ నెల 28న జరుగనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అతనొక్కడే చిత్రాన్ని మించి హరే రామ్ వుంటుందని హీరో కల్యాణ్ రామ్ అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం హ్యాపీడేస్ ఫేం మిక్కి.జె.మేయర్ అందిస్తున్నారు.

చిత్రాన్ని వచ్చేనెలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, సీత తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT